భారతదేశం, ఫిబ్రవరి 26 -- జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. అక్కడ ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ సెట్ అంతా కూడా కాలిపోయింది. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

"ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. పరిస్థితిని అంచనా వేస్తున్నాం. మంటలు అదుపులోకి వచ్చాయి. 4వ అంతస్తులోని భవనం నుంచి పొగ మాత్రమే వెలువడుతోంది. భవనంలో ఎవరూ లేరు' అని జిల్లా అగ్నిమాపక అధికారి-2 (డీఎఫ్ఓ-2) అజ్మీరా శ్రీదాస్ తెలిపారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ. మంగళ్య గౌరి చీర షోరూమ్ లో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. లోపల 10 మంది పని చేస్తున్నారని.. కానీ మంటలు చెలరేగిన...