భారతదేశం, ఫిబ్రవరి 21 -- కొండాపూర్‌లో 7 ఎక‌రాల మేర ఉన్న పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ రూ. 1400 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైడ్రా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 78 నుంచి 93 లో రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ కాల‌నీ పేరుతో 2059 ప్లాట్ల‌తో 1993లో గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్ వేశారు. ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌కు 5 ఎక‌రాలు కేటాయించారు. అలాగే పాఠ‌శాల‌కు దాదాపు ఎక‌రా స్థ‌లం,పార్కుల కోసం ఎక‌రాకు పైగా కేటాయించారు. పాఠ‌శాల‌కు కేటాయించిన స్థ‌లంలో 1000 గ‌జాల మేర అపార్టుమెంట్‌ను నిర్మించేశారు. క‌మ్యూనిటీ హాల్ కోసం 2181 గ‌జాల‌ను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్ర‌మ‌ణ...