భారతదేశం, ఫిబ్రవరి 27 -- హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(H-CITI) ప్రాజెక్ట్ కింద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈరోజు(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఈ దారుల్లో వెళ్లేవారు ఆంక్షలు, మళ్లింపులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో స్తంభాల నిర్మాణ పనులు శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) నుండి ప్రారంభమయ్యాయి. ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ (గేట్-I), జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఉంటుందని భావిస్తున్నా...