భారతదేశం, మే 5 -- Illegal Stone Crushing Hyderabad : నగర శివార్లలోని ప్రకృతిని, భూగర్భ జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న అక్రమ మైనింగ్ మాఫియాపై హైడ్రా (HYDRAA) యుద్ధం ప్రకటించింది. బడా బాబుల అండదండలతో, ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ (RMC) ప్లాంట్లపై మంగళవారం ఉదయం ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించింది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB), మైనింగ్ మరియు రెవెన్యూ శాఖల విజ్ఞప్తి మేరకు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది.

6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు పూర్తిగా నేలమట్టం చేయబడ్డాయి.12 ఆర్ఎంసీ (Ready Mix Concrete) ప్లాంట్లను అధికారులు తొలగించారు. భవిష్యత్తులో ఇక్కడ మైనింగ్ చ...