భారతదేశం, ఏప్రిల్ 9 -- హైదరాబాద్ సిటీకి చెందిన ఫైసల్ రెహ్మాన్ అనే వ్యక్తి ద్విచక్రవాహనం చోరీకి గురైంది. ఈ ఘటన జరిగి మూడు నెలలవుతుంది. ఈ చోరీ ఘటనపై యజమాని రెహ్మాన్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మూడు నెలలు గడిచినా వాహనం ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. కట్ చేస్తే యజమాని అయిన ఫైసల్ రెహ్మాన్ ఫోన్‌కు ఈ- చలానా మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే. షాక్ అయిపోయాడు. తన బైక్ కనిపించటమే కాదు. ఓ వ్యక్తి నడపుతున్నట్లు ఉంది. వెంటనే అప్రమత్తమైన రెహ్మాన్. మరోసారి సోషల్ మీడియా వేదికగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. తన వద్ద బైక్ లేదు కదా.. ఈ చలానా ఏంటా అని...