భారతదేశం, జూన్ 4 -- ప్రముఖ చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ.. భారత ఆటోమొబైల్ మార్కెట్​లో సరికొత్త మైలురాయిని అధిగమించడానికి సిద్ధమైంది. తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్​ఈవీ) ఎస్‌యూవీ కారును జూన్ 9, 2026న భారత్‌లో విడుదల చేయబోతోంది. 'డీఎం-ఐ సూపర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్' టెక్నాలజీతో రానున్న ఈ కారు.. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో మైండ్ బ్లోయింగ్ మైలేజ్/ రేంజ్‌ను ఇస్తుంది. టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ అప్‌కమింగ్ ఎస్‌యూవీల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

భారతదేశంలో ఇప్పటివరకు కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను (అట్టో 3, సియెల్, ఈ6) మాత్రమే విక్రయిస్తూ ప్రీమియం ఈవీ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న బీవైడీ, ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది! దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జి...