భారతదేశం, ఆగస్టు 17 -- Hushar Pittalu OTT Release Details: యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసే జొనర్లలో రొమాంటిక్ ఒకటి. అలాంటి రొమాంటిక్ జోనర్‌కు కాస్తా బోల్డ్, కామెడీ ఎలిమెంట్స్, ఎమోషన్స్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమానే హుషార్ పిట్టలు. యువతరం ఆలోచనలు, నేటితరం సంబంధాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్.

హుషార్ పిట్టలు సినిమాలో వాసవి గణేశన్, అన్ష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌కు భిక్షు యాదవ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హుషార్ పిట్టలు చిత్రం ప్రమోషనల్ కంటెంట్, పాటలతోనే యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ముఖ్యంగా హుషార్ పిట్టలు టీజర్‌లోని బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు చరణ్ అర్జున్ అందించగా.. సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌...