భారతదేశం, మార్చి 28 -- బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేస్తున్న యాక్టర్, సింగర్ సబా ఆజాద్ రీసెంట్‌గా హాస్పిటల్ పాలైంది. సైక్లోస్పోరియాసిస్ అనే ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్ రావడంతో ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. సోషల్ మీడియాలో తన హెల్త్ అప్‌డేట్ ఇస్తూ, కూరగాయలను పక్కాగా కడగాలని, లేకపోతే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయని నెటిజన్లను హెచ్చరించింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి ఇంటర్నెట్‌లో జనాలు బాగా టెన్షన్ పడుతున్నారు.

తన లైఫ్‌లో గడిపిన చెత్త 14 రోజుల గురించి బాలీవుడ్ నటి సబా ఆజాద్ తన పోస్ట్‌లో చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏకంగా 4 కిలోల బరువు తగ్గానని, కనీసం నడవలేని పరిస్థితికి వెళ్లిపోయానని ఆమె చెప్పింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన బాధను పంచుకుంటూ.. "నా లైఫ్‌లో అత్యంత దారుణమైన 14 రోజులు ఇవి. సైక్లోస్పోరా కయెటానెన్స...