భారతదేశం, ఏప్రిల్ 5 -- ప్రస్తుతం సోషల్ మీడియాలో నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' టీజర్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇందులోని వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యతపై నెటిజన్లు పెదవి విరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే వార్ 2 కంటే వార్ 1 మూవీ వీఎఫ్ఎక్స్ బెటర్ అని హృతిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రామాయణ సినిమా నుంచి రీసెంట్ గా రణ్ బీర్ కపూర్ శ్రీ రాముడి లుక్ ను రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇందులో వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా గురించి అభిప్రాయం ఏర్పరచుకునే ముందు, మేకర్స్ క్రియేటివ్ ఇంటెంట్ ను అర్థం చేసుకోవాలని ప్రేక్షకులను హృతిక్ రోషన్ కోరాడు.

ఈ పోస్ట్...