భారతదేశం, ఫిబ్రవరి 28 -- దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. శనివారం రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ అందిస్తారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అరికట్టేందుకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు HPV వ్యాక్సినేషన్ ఇస్తారు. 3 నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దేశవ్యాప్తంగా కోటీ 15 లక్షల మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
మరోవైపు తెలంగాణలోనూ ఈ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.