భారతదేశం, నవంబర్ 13 -- Top 5 Horror Thrillers OTT: ఓటీటీలో హారర్ థ్రిల్లర్లు చాలా ఉన్నాయి. అయితే వీటిలో ఈ టాప్ 5 సౌత్ ఇండియా మూవీస్ మాత్రం చాలా స్పెషల్. ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో ఉన్న ఈ సినిమాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అతని పక్కింట్లో ఉండే ఓ తల్లి, కూతురు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ పాప ప్రవర్తనలో అనుకోకుండా భయంకరమైన మార్పులు వస్తాయి. ఆ పాపను దుష్టశక్తి నుంచి రక్షించే క్రమంలో వారు ఎదుర్కొనే ఊహించని, భయానక సంఘటనలే 'మసూద' కథ.

తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి 7.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

1990ల కాలంలో రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. చేతబడి చేశారనే అనుమానంతో ఒ...