భారతదేశం, ఏప్రిల్ 22 -- Horror Thriller: హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు హాలీవుడ్ రచయిత స్టీఫెన్ కింగ్ పేరు సుపరిచితమే. ఆయన రాసిన కథలు వెండితెరపై సృష్టించే ప్రకంపనలు అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన హారర్ థ్రిల్లర్ 'సలేమ్స్ లాట్' (Salem's Lot) ఎట్టకేలకు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

హారర్ థ్రిల్లర్ సలేమ్స్ లాట్ సినిమా కథ విషయానికి వస్తే.. బెన్ మియర్స్ అనే రచయిత తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి, తన తదుపరి పుస్తకం కోసం కావాల్సిన ప్రేరణ పొందేందుకు తన సొంత ఊరైన 'జెరూసలేమ్స్ లాట్'కు తిరిగి వస్తాడు.

అయితే అక్కడ అతనికి ఊహించని భయానక పరిణామాలు ఎదురవుతాయి. ఆ ఊరి ...