భారతదేశం, మే 12 -- ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా.. భారతీయ అడ్వెంచర్ బైక్ ప్రేమికుల కోసం సరికొత్త ఎన్​ఎక్స్500 ఈ-క్లచ్ మోడల్‌ను మార్కెట్​లోకి తాజాగా విడుదల చేసింది. ఫలితంగా అంతర్జాతీయంగా విజయవంతమైన తన క్లచ్ ఆటోమేషన్ టెక్నాలజీని ఇప్పుడు మిడ్-సైజ్ అడ్వెంచర్ సెగ్మెంట్​లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త మోడల్ ధరను రూ. 7.43 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్టైలిష్​ బైక్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..

ఈ హోండా బైక్‌లో జరిగిన అతిపెద్ద మార్పు దాని క్లచ్ సిస్టమ్. హోండా అభివృద్ధి చేసిన ఈ ఈ-క్లచ్ సాంకేతికత, బైక్‌ను స్టార్ట్ చేసేటప్పుడు, గేర్లు మార్చేటప్పుడు, ఆపేటప్పుడు క్లచ్ ఎంగేజ్‌మెంట్‌ను ఎలక్ట్రానిక్‌గా నిర్వహిస్తుంది....