భారతదేశం, మే 21 -- Honda City facelift launch in India : భారతదేశ ఆటోమొబైల్​ రంగంలోని మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో సుదీర్ఘ కాలంగా రారాజుగా వెలుగుతున్న హోండా సిటీ కారును కంపెనీ సరికొత్త హంగులతో అప్‌డేట్ చేసింది. రేపు, మే 22, 2026 న ఈ 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్' భారత మార్కెట్​లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన టీజర్లను విడుదల చేయగా.. డీలర్‌షిప్‌ల వద్ద కనిపించిన ఈ సెడాన్ స్పై షాట్స్ ద్వారా ఈ సరికొత్త మోడల్‌లో జరిగిన ప్రధాన మార్పులు వెల్లడయ్యాయి. వాటి వివరాలను మీరూ చూసేయండి..

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో బాహ్య రూపకల్పనకు సంబంధించి కంపెనీ సరికొత్త కాస్మెటిక్ మార్పులు చేసింది.

ఫ్రంట్ ప్రొఫైల్: కారు ముందు భాగంలో స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ల్స్తో కూడిన కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి....