భారతదేశం, నవంబర్ 15 -- జపాన్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు సరికొత్త గ్లోబల్ ఎస్‌యూవీ మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. అవే హోండా అవాన్సియర్, హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. హోండా అభివృద్ధి చేసిన నెక్ట్స్ జెన్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న తొలి కార్లలో అవాన్సియర్ ఒకటి. డిసెంబర్ 1, 2026న థాయ్‌లాండ్ వేదికగా ఈ కారును ఆవిష్కరించనున్నారు. అయితే మూడు వరుసల సీటింగ్ ఉన్న ఈ ఎస్‌యూవీని భారత్‌లోకి తీసుకురావడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. అదే సమయంలో భారతీయ కార్ల ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హోండా ఆల్ఫా ఈవీ' డిసెంబర్ 2, 2026న మన దేశంలో అధికారికంగా అరంగేట్రం చేయనుంది.

ఇప్పటివరకు పెట్రోల్, హైబ్రిడ్ కార్లకే పరిమితమైన హోండ...