Honda Alpha : ఇండియాలోకి హోండా ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఆరోజే 'ఆల్ఫా' ఎంట్రీ!
భారతదేశం, నవంబర్ 4 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని గ్లోబల్ ఈవీ హబ్‌గా మార్చే దిశగా జపాన్ వాహన దిగ్గజం 'హోండా కార్స్ ఇండియా' ఒక చారిత్రాత్మక ప్రకటన చేసింది. గ్లోబల్ మార్కెట్ల కోసం భారత్‌లోనే ప్రత్యేకంగా ఉత్పత్తి చేయనున్న తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ అధికారిక పేరును 'హోండా ఆల్ఫా'గా ప్రకటించింది.
ఈ ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ కారు గ్లోబల్ ఆవిష్కరణ డిసెంబర్ 2న జరగనుంది. విశేషమేమిటంటే ఈ ఎస్‌యూవీని లాంచ్ చేయబోతున్న ప్రపంచంలోనే తొలి దేశం మన భారత్. గ్రీకు అక్షరమాలలో మొదటి అక్షరమైన 'ఆల్ఫా' నుంచి ఈ పేరును స్వీకరించారు. విద్యుత్ వాహన విభాగంలోకి సరికొత్త ఆరంభంతో అడుగుపెడుతున్నందున ఈ పేరు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.