భారతదేశం, ఫిబ్రవరి 6 -- శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కాల్పులు కలకలం రేపాయి. పట్టణంలో సీఐగా పని చేస్తున్న ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ. నాగేంద్ర కాలిపై కాల్పులు జరిపారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
గాయపడిన సీఐ, కానిస్టేబుల్‌తో పాటు నిందితుడిని హిందూపురంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ గ్యాంప్ రేప్ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నాగేంద్ర తిరగబడ్డాడు. ఈ క్రమంలోనే కత్తితో దాడికి యత్నించినట్లు తెలిసింది. నాగేంద్రపై ఏపీ, కర్ణాటకలో కలిపి 90కిపైగా కేసులు ఉన్నట్లు సమాచారం. మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Published by HT Digital Content Services wit...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.