భారతదేశం, జూలై 24 -- Himachal Pradesh Landslide Accident : హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంత ప్రయాణాలు మళ్లీ తీవ్ర విషాదాన్ని నింపాయి. శుక్రవారం లాహౌల్-స్పితి జిల్లాలోని ఉదయ్‌పూర్-పాంగీ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ట్యాక్సీపై కొండ పైభాగం నుంచి ఒక్కసారిగా భారీ రాళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఆరు నెలల పసికందు సహా మొత్తం 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సమయస్ఫూర్తితో బయటకు దూకడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

కుల్లు నుంచి కిల్లార్ వైపు వెళ్తున్న టాటా సుమో వాహనం కడు నాలా సమీపానికి చేరుకోగానే.. సమీపంలోని కొండ నుంచి భారీ రాళ్లు ఒక్కసారిగా వాహనంపై పడ్డాయి. రాళ్ల దెబ్బకు వాహనం నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జిల్లా కేంద్రం కీలాంగ్‌కు దాదాపు 7...