భారతదేశం, మార్చి 5 -- బాలీవుడ్‌లో 'దమ్ లగా కే హైషా', 'సాండ్ కీ ఆంఖ్', 'బధాయ్ దో' వంటి చిత్రాలతో పవర్‌ఫుల్ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్. సాధారణంగా సెలబ్రిటీలు తమ కెరీర్‌లో చేసిన తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడరు.

కానీ, భూమి పెడ్నేకర్ మాత్రం అందుకు భిన్నంగా, తాను చేసిన కొన్ని సినిమాల ఎంపిక విషయంలో పొరపాట్లు జరిగాయని నిజాయితీగా అంగీకరించారు. ఇటీవల జరిగిన 'వి ది ఉమెన్' (We the Women) కార్యక్రమంలో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన సినీ ప్రయాణంలోని ఎత్తుపల్లాలను పంచుకున్నారు.

కెరీర్‌లో మీరు చేసిన ఎంపికల్లో తప్పుగా అనిపించినవి ఏవైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు భూమి పెడ్నేకర్ చాలా సూటిగా సమాధానమిచ్చారు.

"అవును, నేను కొన్ని తప్పులు చేశాను. నా కెరీర్ ఆరంభం నుంచి మహిళా సాధికారత ఉన్న, బలమైన పాత్రలనే ఎంచుకుంటూ వచ్చాను. కానీ, ...