Heroine: రెండుసార్లు గర్భస్రావం- 43 ఏళ్లు వచ్చిన తల్లి కాలేకపోయిన తెలుగు హీరోయిన్- చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే?
భారతదేశం, ఆగస్టు 2 -- Actress Nauheed Cyrusi About Miscarriages: జీవితం అనుకున్నట్లు సాగనప్పుడు మన ఆలోచనలే రూపురేఖలు మార్చుకుంటాయి. సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది ఒకప్పటి తెలుగు హీరోయిన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నౌహీద్ సైరుసీకి.
ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్లో తనదైన నటనతో ఆకట్టుకున్న నౌహీద్ సైరుసీ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. రెండుసార్లు గర్భస్రావం (Miscarriages) కావడం తన జీవిత గమ్యాన్నే మార్చేసిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నౌహీద్, 2018లో మొదటిసారి గర్భం దాల్చారు. అయితే మూడో నెల చెకప్ కోసం వెళ్లినప్పుడు డాక్టర్లు చెప్పిన నిజం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. కడుపులోని బిడ్డ గుండెచప్పుడు ఆగిపోయిందని తేలడంతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.