భారతదేశం, అక్టోబర్ 13 -- Heroine: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇటీవల తల్లి అయిన తర్వాత మొదటిసారి జనం ముందుకు వచ్చిన సమయంలో ఆమె లుక్స్, బరువు పెరగడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. మాతృత్వాన్ని పొందిన ఒక మహిళను ఇలా దారుణంగా బాడీ షేమింగ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే 2024లో తల్లిగా మారిన మరో టాలెంటెడ్ నటి రిచా చద్దా (Richa Chadha) సోషల్ మీడియా సైకోలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా గట్టి కౌంటర్ ఇచ్చారు.

తల్లిగా మారిన హీరోయిన్లను గౌరవించడంలో ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుందని, కానీ సోషల్ మీడియా వెనుక దాక్కునే కొందరు పనికిమాలిన వాళ్లే ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తారని రిచా చద్దా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రిచా చద్దా మాట్లాడుతూ.. "మహిళలు తమ శరీరంపై ...