భారతదేశం, నవంబర్ 21 -- భారత ద్విచక్ర వాహన మార్కెట్లో దశాబ్దాలుగా రారాజుగా వెలుగుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ 'హీరో స్ల్పెండర్ ప్లస్" కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్ ఇచ్చింది! స్ల్పెండర్ ప్లస్ శ్రేణిలోని అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ పెంచేసింది. ఈ ధరల సవరణలో భాగంగా 'స్పెషల్ ఎడిషన్స్' వేరియంట్‌పై గరిష్టంగా రూ. 3,086 వరకు భారం పడింది. అయితే ఆ వేరియంట్ పేరును మార్చడంతో పాటు కొత్త రంగులను కంపెనీ జోడించింది. బైక్ ఇంజిన్, మెకానికల్ విభాగాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మార్పులతో కొనుగోలుదారులకు వివిధ వేరియంట్లలో భిన్నమైన ఫీచర్లు, రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లోని పల్లె నుంచి పట్నం వరకు సామాన్యుడి ఫేవరెట్ బైక్ అంటే ముందుగా గుర్తొచ్చేది హీరో స్ల్పెండర్ ప్లస్. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో నిత్యం ఆఫీసుల...