భారతదేశం, జూలై 28 -- Hero Injury: తెలుగు చిత్రసీమ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ స్థాయి విజయం వెనుక టాలీవుడ్ స్టార్ హీరోలు పడుతున్న శ్రమ, తీసుకుంటున్న శారీరక రిస్క్ సాధారణమైనది కాదు. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు వరుసగా ఏదో ఒక గాయం బారిన పడటం, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి రావడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

టాలీవుడ్ దిగ్గజ హీరోల నుంచి యంగ్ స్టార్ల వరకు ప్రతీ ఒక్కరినీ ఈ గాయాల సమస్య వెంటాడుతోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సమయం నుంచే మెగాస్టార్ చిరంజీవి భుజం నొప్పితో బాధపడుతూ ప్రత్యేక శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ఇటీవల తీవ్రమైన భుజం గాయానికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

తాజాగా ఎన్‌బీకే111 మూవీ షూటింగ్...