Hero Glamour X బైక్‌లో కొత్త వేరియంట్ లాంచ్- బడ్జెట్ ధరలోనే అధునాతన సేఫ్టీ ఫీచర్లు!
భారతదేశం, సెప్టెంబర్ 13 -- ద్విచక్ర వాహనదారుల రక్షణే ధ్యేయంగా దేశీయ అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. 125సీసీ సెగ్మెంట్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన తన 'గ్లామర్ ఎక్స్' సిరీస్‌లో అత్యంత సురక్షితమైన 'ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్' వేరియంట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ. 1.01 లక్షలుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్‌షిప్‌లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, ఆఫీస్‌కు వెళ్లే యువత 125సీసీ బైక్‌లను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఈ రేంజ్ బైక్స్‌లో సురక్షితమైన బ్రేకింగ్ సిస్టమ్ లోపించిందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉండేది. దీనిని గమనించిన హీరో సంస్థ, బడ్జెట్ ధరలోనే అధునాతన సేఫ్టీ టెక్నాలజీని సామాన్యుడికి సైతం అందుబాటులోకి తెచ్చింది.
హీరో గ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.