భారతదేశం, మే 2 -- Anil Kapoor Emotional Comments About Parenting: బాలీవుడ్ వెండితెరపై సూపర్ హీరోగా, ఎనర్జిటిక్ యాక్టర్‌గా మెప్పించే అనిల్ కపూర్.. నిజ జీవితంలో తండ్రిగా మాత్రం తాను ఆశించిన స్థాయిలో లేనని ఒప్పుకున్నారు. ఇటీవల లిల్లీ సింగ్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో అనిల్ కపూర్ మాట్లాడుతూ.. తన పిల్లలైన సోనమ్ కపూర్, హర్షవర్ధన్ కపూర్, రియా కపూర్ల పెంపకంలో తన ప్రమేయం చాలా తక్కువని తెలిపారు.

"నేను షూటింగులతో బిజీగా ఉండి ఇంట్లో గడిపే సమయం చాలా తక్కువ. నా గురించి పిల్లలు మంచిగా మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది. కానీ, నిజాయితీగా చెప్పాలంటే తండ్రిగా నేను విఫలం అయ్యాను. ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. పిల్లలతో గడపాల్సిన ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయాను. ఒక రకంగా చెప్పాలంటే సునీత ఒక 'సింగిల్ పేరెంట్' తరహాలో వారిని పెంచి పెద్ద చేసింది" అని అనిల్ కపూర్ మనస...