భారతదేశం, అక్టోబర్ 5 -- Juhi Chawla Reveals Marriage Secrets: 90స్ కాలం నాటి గ్లామరస్ క్వీన్, టాలీవుడ్‌లో నాగార్జున సరసన 'విక్కీదాదా' వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా. వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సీనియర్ కథానాయిక, తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎప్పుడూ మీడియా కంట పడకుండా గోప్యంగా ఉంచుకోవడానికే మొగ్గుచూపారు.

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, మెహతా గ్రూప్ ఛైర్మన్ జే మెహతాను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె తన కుటుంబ విషయాలను అంతగా బయటకు రానివ్వలేదు. ఇటీవల గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో జూహీ పాల్గొని, తన పెళ్లి నాటి సంఘటనలు, ఆ సమయంలో ఎదురైన భావోద్వేగాల గురించి మనసు విప్పి మాట్లాడారు.

దర్శకుడు రాకేష్ రోషన్ ద్వారా జే మెహతా, జూ...