భారతదేశం, జూలై 12 -- భారతదేశంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే బైక్‌లపై పెద్దలతో పాటు ప్రయాణించే చిన్న పిల్లల భద్రతను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. మార్కెట్లోనూ పిల్లల కోసం ప్రత్యేకమైన, సురక్షితమైన హెల్మెట్లు పెద్దగా అందుబాటులో లేవు. ఈ లోటును భర్తీ చేస్తూ ప్రముఖ రైడింగ్ గేర్ తయారీ సంస్థ 'స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా' ఒక కొత్త ప్రాడక్ట్​ని తీసుకొచ్చింది. బైక్‌లపై వెనుక కూర్చునే చిన్న పిల్లల (చైల్డ్ పిలియన్ రైడర్స్) కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డూడుల్' హెల్మెట్ సిరీస్‌ను తాజాగా ఆవిష్కరించింది.

చిన్న పిల్లల శారీరక ఆకృతి, వారి భద్రతా అవసరాలపై విస్తృతంగా పరిశోధనలు చేసిన తర్వాతే ఈ డూడుల్ హెల్మెట్లను ఇంజనీరింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా పెద్దలు వాడే హెల్మెట్లు బరువుగా ఉండటం వల్ల పిల్లల మెడప...