Healthy breakfast : ఉదయాన్నే అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం, అలసట ఖాయం!
భారతదేశం, అక్టోబర్ 4 -- కొన్ని రోజులు నిద్రలేవగానే ఎంతో ఉత్సాహంగా, రోజంతా చురుగ్గా పనిచేస్తాం. కానీ మరికొన్ని రోజులు అందుకు భిన్నంగా తీవ్రమైన బద్ధకం, నీరసం ఆవహిస్తాయి. ఎలాంటి పని చేయాలనిపించదు. దీనికి వాతావరణ మార్పులో లేక నిద్ర లేమియో కారణమని భావిస్తుంటాం. కానీ మన శక్తి స్థాయిలను నిర్ణయించడంలో మనం ఉదయం తీసుకునే అల్పాహారానిదే ప్రధాన పాత్ర అని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ అంటున్నారు.
మనం ఉదయాన్నే తినే టిఫిన్ మన జీవక్రియలను నిర్దేశిస్తుందని ఆమె వివరించారు. సాధారణంగా మనం తినే కొన్ని రకాల టిఫిన్లు మన ఆరోగ్యానికి, శక్తి స్థాయిలకు ఎలా నష్టం కలిగిస్తున్నాయో ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియోలో విశ్లేషించారు.
మనదేశంలో చాలామంది ఉదయాన్నే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ, పోహా (అటుకులు) లేదా బ్రెడ్, ప్యాన్కేక్లు, పాలు-సిరియల్స్, పండ్ల ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.