భారతదేశం, ఆగస్టు 31 -- భారత బ్యాంకింగ్ రంగానికి దిశానిర్దేశం చేసే ప్రైవేట్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీశన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రతికూల వార్త వెలువడినప్పటికీ, సోమవారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంక్ షేరు ధర లాభాల్లో కొనసాగుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తోంది.

గత వారం శుక్రవారం ముగింపు ధర రూ.720.30తో పోలిస్తే, సోమవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు రూ.723.05 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక్కసారిగా రూ.739.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయానికి హెచ్​డీఎప్​సీ బ్యాంక్ షేరు ధర 1శాతం లాభంతో రూ. 728 వద్ద ట్రేడ్ అవుతోంది.

మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు బ్యాం...