భారతదేశం, ఫిబ్రవరి 18 -- యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. మార్చి 6వ తేదీతో గడువు ముగుస్తుంది. అప్లికేషన్ హార్డ్ కాపీని మార్చి 10వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. బ్యాక్ లాగ్ లో మిగిలిన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ప్రొఫెసర్ (లెవల్-14) పోస్టులు 17 ఉండగా.. అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్-13A) ఖాళీలు 20, అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెవల్-10) ఉద్యోగాలు 3 ఉన్నాయి. పీహెచ్‌డీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. రీసెర్చ్ లో మంచ...