భారతదేశం, ఏప్రిల్ 23 -- Harnaaz Kaur Sandhu Reveals Her Addiction: 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ముద్దాడి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన బ్యూటీ హర్నాజ్ సంధు. మిస్ యూనివర్స్ అందుకున్న తర్వాత హర్నాజ్ సంధు ఎదుర్కొన్న పరిస్థితులు అంత సులభమైనవేమీ కావట. కిరీటం గెలిచిన కొద్ది నెలలకే హర్నాజ్ సంధు బరువు పెరగడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

అయితే, ఆ సమయంలో తను 'సీలియాక్' (Celiac disease) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు హర్నాజ్ సంధు ప్రకటించారు. గోధుమలు, బార్లీ వంటి వాటిలో ఉండే గ్లూటెన్ పడకపోవడం వల్ల కలిగే అలర్జీ ఇది. ఈ నేపథ్యంలో హర్నాజ్ తీసుకున్న ఆహారం, జీవనశైలి ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి.

తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్నాజ్ సంధు న్యూయార్క్‌లో ఉన్నప్పుడు తనకు అలవాటైన ఒక తీపి వ్యసనం గురించి ఆసక్తికర...