భారతదేశం, ఏప్రిల్ 19 -- Harish Kumar Reveals Who Saved Him: అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో హరీష్ కుమార్. తెలుగులో ప్రేమ ఖైదీ, ఓహో నా పెళ్లంట, ప్రేమ విజేత, క్రాంతి క్షేత్ర సినిమాల్లో హీరోగా మెప్పించాడు. ఆంధ్రకేసరి మూవీతో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో మొత్తం దాదాపు 280 సినిమాల్లో నటించాడు హరీష్ కుమార్.

అలాంటి హరీష్ కుమార్ ప్రాణాలను రియల్ లైఫ్‌లో ఓ హీరోయిన్ కాపాడిందని తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. కపూర్ వంశం నుంచి వెండితెరకు పరిచయమైన బ్యూటీ కరిష్మా కపూర్. 1991లో 'ప్రేమ ఖైదీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కరిష్మా కపూర్.

తెలుగులో సూపర్ హిట్ అయిన 'ప్రేమ ఖైదీ'కి ఇది హిందీ రీమేక్. అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రంలో కరిష్మా సరసన తెలుగులో హీరోగా చేసిన హరీష్ కుమార్ నటించాడు. ఈ సినిమా...