భారతదేశం, మే 29 -- Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయడానికి సిద్ధమైనట్లు టాక్. కెప్టెన్ గా తప్పించడమే కాకుండా, అతడిని జట్టు నుంచి పూర్తిగా తొలగించే యోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

హార్దిక్ పాండ్య సారథ్యంలో ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్ లో అంచనాలు అందుకోలేకపోయింది. పేలవమైన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో హార్డిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ అంచనాలతో 2024లో ముంబై జట్టులోకి వచ్చాడు హార...