భారతదేశం, మార్చి 9 -- అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి హిస్టరీ క్రియేట్ అయింది. ఇండియా వరుసగా రెండో సారి టీ20 ప్రపంచకప్ ముద్దాడింది. అటు గ్రౌండ్ లోని ఆటగాళ్లు, ఇటు దేశంలోని కోట్లాది మంది అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇదే సంతోషంలో తన ప్రియుడు హార్దిక్ పాండ్యకు మహీకా శర్మ గ్రౌండ్ లోనే ముద్దు పెట్టింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

భారతదేశం T20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న తర్వాత, సంబరాల మధ్య హార్దిక్ పాండ్యాకు, అతని ప్రేయసి మహీకా శర్మకు మధ్య మైదానంలో ఒక రొమాంటిక్ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. విజయం అనంతరం మహీకా వెంటనే మైదానంలోకి వచ్చి హార్దిక్‌ను ఆలింగనం చేసుకుని, బుగ్గపై ముద్దు పెట్టింది. అప్పుడు హార్దిక్ ఆమెను తన 'లక్కీ ఛార్మ్' అని పేర్కొన్నాడు. T20 వరల్డ్ కప్ ను రెండుసార్లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది,...