భారతదేశం, జూలై 16 -- భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన, కోట్లాది మంది భక్తుల "జై జగన్నాథ్" నినాదాల మధ్య సాగే శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం నేడు అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. ఒడిశాలోని పూరీ క్షేత్రంతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 12వ శతాబ్దానికి చెందిన పూరీ క్షేత్రం ప్రస్తుతం భక్తజన సంద్రమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి సమేతంగా సాగే ఈ రథాల ఊరేగింపును కళ్లారా చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా ఏటా వేలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి పయనం అవుతుంటారు. భక్తుల రక్షణ కోసం ఒడిశా ప్రభుత్వం పూరీ పట్టణాన్ని కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి తెచ్చింది.

గురువారం సాయంత్రం 4:00 గంటలకు పూరీ గ్రాండ్ రోడ్...