భారతదేశం, ఏప్రిల్ 6 -- కోలీవుడ్ వెర్సటైల్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'హ్యాపీ రాజ్' (Happy Raj). మార్చి 27న థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం హ్యాపీ రాజ్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి.

ఆ లెక్కన 'హ్యాపీ రాజ్' కూడా నెలాఖరులోపు డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అధిక...