భారతదేశం, నవంబర్ 24 -- హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివుడికి ప్రీతికరమైన ఈ రోజున నదీ స్నానాలు ఆచరించడం, తులసి కోట వద్ద దీపాలు వెలిగించడం, జ్వాలా తోరణాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ శుభ సందర్భంలో మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసేందుకు 50 విషెస్ ఇక్కడ ఉన్నాయి.

ఆ పరమేశ్వరుని చల్లని చూపు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!

ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే ప్రతి దీపం మీ ఇంటిల్లిపాది జీవితాల్లోని చీకట్లను తొలగించి, సుఖసంతోషాలను నింపాలి.

శివకేశవుల ఆశీస్సులతో మీ ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆశ...