భారతదేశం, సెప్టెంబర్ 13 -- Hanuman Ansh Producer: ఇండియన్ సినీ ఇండస్ట్రీని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తూ, అతి చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామా 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలమైండ్ బ్లాంక్ చేసింది.

తక్కువ థియేటర్లలో పరిమితంగా విడుదలైన ఈ చిన్న సినిమా 'హనుమాన్ అంశ' పబ్లిక్ మౌత్ టాక్ తో పాపులర్ అయింది. ప్రేక్షకుల ఆదరణతో దేశవ్యాప్త బ్లాక్‌బస్టర్‌గా అవతరించి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అతిపెద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇంత డబ్బు ఏం చేయాలో తెలియడం లేదంటూ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

హనుమాన్ అంశ సినిమా ఊహించని విజయం కంటే కూడా, ఈ...