భారతదేశం, నవంబర్ 13 -- Hanuman Ansh OTT: ఈ ఏడాది బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే అత్యధిక లాభాలు గడించిన సినిమాల్లో ఒకటి హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ మూవీ.. ఇటు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా భారీగానే వెనుకేసుకుంది.

బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. 'హనుమాన్ అంశ్' చిత్ర నిర్మాతలు పోస్ట్-థియేట్రికల్ హక్కుల విక్రయం ద్వారా ఏకంగా రూ. 63 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రసార హక్కులు రెండింటినీ సోనీ సొంతం చేసుకుంది.

నవంబర్ 27 నుంచి సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండగా, త్వరలోనే సోనీ మ్యాక్స్ (Sony MAX) ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. టీవీ ప్రసార తేదీని త్వరలో ప్...