భారతదేశం, అక్టోబర్ 31 -- ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 రాత్రి రాగానే పాశ్చాత్య దేశాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది! 'హాలోవీన్' పేరుతో రకరకాల దెయ్యాలు, వికారమైన వేషధారణలు, గుమ్మడికాయల దీపాలు, ఇళ్ల ముందు భయానక బొమ్మలు దర్శనమిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లోనూ ఈ హాలోవీన్ వేడుకల సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. పండుగ కేవలం వినోదం, స్వీట్లు, కాస్ట్యూమ్ పార్టీలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే! దీని వెనుక వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మికత, వాతావరణ మార్పుల చరిత్ర దాగి ఉంది.

'ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్' కథనం ప్రకారం.. హాలోవీన్ పండుగ మూలాలు ప్రాచీన కెల్టిక్ తెగల కాలానికి చెందినవి. కాలక్రమేణా ఇది ఎలా రూపాంతరం చెందిందో లోతుగా పరిశీలిద్దాము.

నవంబర్ 1న క్రైస్తవ సాంప్రదాయంలో 'ఆల్ సెయింట్...