భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసిన గిగ్ వర్కర్ల సంక్షేమ నిబంధనలపై హాలా మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్ రెడ్డి కలకొండ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కార్మికుల జీవితాల్లో పెను మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే, క్షేత్రస్థాయి అమలుపై కీలక సూచనలు చేశారు.

కర్ణాటక, రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల సరసన చేరుతూ తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ ప్లాట్‌ఫామ్-బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) రూల్స్, 2026'ను ఖరారు చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు చట్టబద్ధమైన సామాజిక భద్రత, సంక్షేమ పరిధిలోకి వస్తారు. డెలివరీ పార్ట్‌నర్లు, క్యాబ్, బైక్-ట్యాక్సీ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది, ఈ-కామర్స్ కార్మికులు, హోమ్-సర్వీస్ ప్రొవై...