భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఒకప్పుడు జుట్టు రాలడం, బట్టతల రావడం అనేది 40 లేదా 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోని డెర్మటాలజీ క్లినిక్‌లకు వస్తున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల యువకులే ఎక్కువగా ఉంటున్నారు! నొసటి భాగంలో జుట్టు వెనక్కి తగ్గడం, తల మధ్యలో పలచబడటం, రోజూ విపరీతంగా వెంట్రుకలు రాలిపోవడం నేటి కుర్రాళ్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి జన్యువులే కారణమా? మానసిక ఒత్తిడా? తినే ఆహారమా? లేక జిమ్‌లలో వాడే క్రియాటిన్ సప్లిమెంట్లా? ఈ సమస్య వెనుక ఉన్న అసలు నిజాలను ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ 'ట్రయా' కన్సల్టెంట్ డాక్టర్ రాశి సోని విశ్లేషించారు.

యువకుల్లో నుదిటి పైన జుట్టు వెనక్కి పోవడం, తలపైన పలచబడటానికి ప్రధాన కారణం 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా'. దీనిని సాధారణంగా జన్యుపరమైన బట్టతల అంటారు....