భారతదేశం, ఏప్రిల్ 21 -- Hair growth serum : జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఆందోళన అంతా ఇంతా కాదు! జుట్టును పెంచాలని చేసే ప్రయత్నం కూడా అంతా ఇంతా కాదు. అయితే, మార్కెట్​లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయిన వారికి శాస్త్రవేత్తలు ఒక శుభవార్త చెప్పారు. తైపీలోని 'స్విట్జర్ బయోటెక్ కంపెనీ' (ఎస్​బీసీ) శాస్త్రవేత్తల బృందం, ఉష్ణమండల మొక్కల సారాన్ని ఉపయోగించి ఒక సరికొత్త హెయిర్ గ్రోత్ సీరాన్ని అభివృద్ధి చేసింది. ఇది కేవలం 56 రోజుల్లోనే జుట్టు థిక్​నెస్​ని, సాంద్రతను గణనీయంగా పెంచుతుందని క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపించింది.

హెయిర్​ గ్రోత్​పై ఈ క్లినికల్ ట్రయల్స్‌ను అత్యంత పకడ్బందీగా 'డబల్-బ్లైండ్' పద్ధతిలో నిర్వహించారు. అంటే, ఎవరికి అసలు మందు ఇస్తున్నారు, ఎవరికి సాధారణ నీటి లాంటి ద్రవం (ప్లెసిబో) ఇస్తున్నారో స్వయంగా పరిశోధకులకు క...