భారతదేశం, ఏప్రిల్ 25 -- H-1B Visa scrap : అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలనుకునే భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలేలా ఉంది! వర్క్​ పర్మిట్​ కోసం ఇచ్చే హెచ్-1బీ వీసా వ్యవస్థను సమూలంగా మార్చేస్తూ, ఏకంగా మూడేళ్ల పాటు కొత్త వీసాల జారీని నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్ ఎంపీలు అమెరికా కాంగ్రెస్‌లో ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. లక్షలాది మంది భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం లేకపోలేదు!

రిపబ్లికన్ ఎంపీ ఎలీ క్రేన్ నేతృత్వంలోని బృందం ఈ ప్రతిపాదిత బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం.. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమని వారు చెబుతున్నారు.

"అమెరికా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కాదు, ఇక్కడి పౌరుల కోసం పనిచేయాలి. అర్హులైన అమెరికన్లకు దక్కాల్సిన ఉ...