భారతదేశం, డిసెంబర్ 16 -- అమెరికా వెళ్లాలనుకునే ఐటీ నిపుణులకు, వారి కుటుంబ సభ్యులకు అగ్రరాజ్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. H-1B, H-4 వీసా అభ్యర్థుల కోసం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. డిసెంబర్ 15 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 'ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూ' (Online Presence Review)కు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. అంటే, మీ సోషల్ మీడియా ఖాతాల్లో మీరు చేసే పోస్ట్‌లు, మీ ఆన్‌లైన్ ప్రవర్తనను ఇకపై వీసా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

ఈ కొత్త నిబంధన అమలు దృష్ట్యా, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 కంటే ముందు షెడ్యూల్ అయిన పలు వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసి, వాటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు డిసెంబర్ 9నే ప్రకటించింది. దీనివల్ల ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, వీ...