భారతదేశం, జూలై 13 -- శరీరంలో రోగాలు రాకుండా ఉండాలన్నా, రోజంతా ఉత్సాహంగా గడపాలన్నా మన పొట్ట లోపలి వ్యవస్థ (గట్ హెల్త్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. జీర్ణవ్యవస్థ కేవలం మనం తినే ఆహారాన్ని అరిగించుకోవడానికే పరిమితం కాదు. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని నియంత్రించడంలో, మెదడు చురుగ్గా పనిచేసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పొట్ట ఆరోగ్యం దెబ్బతింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అలసట వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాగా నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం రకరకాల డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు వాడుతుంటారు. కానీ, కేవలం కొన్ని చిన్నపాటి అలవాట్లను మార్చుకుంటే గట్​ హెల్త్​ని మళ్లీ మెరుగుపరుచుకోవచ్చని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు చెబుతున్నారు.

గట్​ హెల్త్​ని కాపాడుకోవడం అనేది మనం అనుకున్నంత కష్టమైన పని ఏమీ కాదని ప్...