భారతదేశం, ఏప్రిల్ 23 -- గురు పుష్య యోగం అనేది చాలా శక్తివంతమైన యోగం. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైన యోగాలలో ఇది కూడా ఒకటి. ఈ ప్రత్యేకమైన యోగం గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు వస్తుంది. ఇది అనంతమైన సంపదను తీసుకురావడానికి సహాయపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను మొదలుపెట్టడానికి కూడా ఇది చాలా మంచిది.

ఈ యోగం వలన ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. సక్సెస్‌ను అందుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్లు చేస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈరోజు గురు పుష్య యోగం ఉండడం చాలా విశేషమైనది. ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రంతో పాటు గంగా సప్తమి కూడా ఉంది. ఈ ఏడాది గురు పుష్య యోగం మళ్లీ మే 21, జూన్ 18న రాబోతున్నాయి. ఈరోజు గురు పుష్య యోగం ఏ రాశుల వారికి కలిసి రాబోతోంది, ఎవరికి విపరీతమైన అదృష్టం, సంపద కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుం...