భారతదేశం, నవంబర్ 29 -- Gunmaaster G9 2 Days Worldwide Collection: బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ, టాలీవుడ్ ప్రేక్షకులకు 'బొమ్మరిల్లు' హాసినిగా ఎప్పటికీ గుర్తుండిపోయే జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'గన్‌మాస్టర్ జీ9' (Gunmaaster G9) బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పికప్ అవుతోంది.

నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన గన్‌మాస్టర్ జీ9 సినిమా.. ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా తెరకెక్కించిన 'యే ప్రేమ్ మోల్ లియా' చిత్రంతో పోటీ పడుతూ బరిలోకి దిగింది. ఆరంభంలో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టలేకపోయినా వీకెండ్ కావడంతో శనివారం (నవంబర్ 28) కలెక్షన్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది.

ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం 'గన్‌మాస్టర్ జీ9' తొలి రోజు శుక్రవారం (నవంబర్ 27) దేశీయ మార్కెట్‌లో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు శనివారం ప్...