భారతదేశం, నవంబర్ 9 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు ఉగ్రరూపం చూపించాడు. సుమతి ప్రేమిస్తున్నది అరుణ్ నే అని తెలుసుకొని చెలరేగిపోతాడు. అరుణ్ ను కొట్టడమే కాదు.. అత్త, బావ మరిదికి ఆ విషయం చెప్పి అతనితో పెళ్లికి అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తాడు.

నీతూతో శృతి గొడవ పడే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. రవిని కాదని నీతూ మరొకరిని హెడ్ షెఫ్ గా చేయాలన్న నీతూ నిర్ణయాన్ని ధిక్కరిస్తుంది. జాబ్ మానేసి వెళ్లిపోదామని రవితో అంటే అతడు మాత్రం నీతూకి సపోర్ట్ చేస్తాడు. ఆమె ఓనర్.. ఆమెదే ఫైనల్ నిర్ణయం అని అంటాడు.

ఓనర్ అయితే కింద పని చేసే వాళ్ల పనిని గుర్తించాలి కానీ.. ఇలా చేయొద్దు అని శృతి అంటుంది. నువ్వు కావాలంటే ఇక్కడే పని చెయ్.. నేను వెళ్లిపోతున్నాను....