భారతదేశం, మార్చి 30 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఆత్మహత్య చేసుకోబోయిన శివను బాలు కాపాడతాడు. అటు మీనాను ఇంటికి తీసుకొస్తాడు. ఈ విషయంలో ప్రభావతి, మనోజ్ లతో గొడవ అవుతుంది. దీంతో తండ్రికి వివరణ ఇవ్వబోయిన బాలు దీనంతటికీ కారణం ప్రభావతే అని స్పష్టం చేస్తాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 30) ఎపిసోడ్ బాలుని ప్రభావతి, మనోజ్ నిలదీసే సీన్ తో మొదలవుతుంది. నీ బామ్మర్ది దొంగతనం చేశాడు.. నువ్వు దానిని తెలిసి కూడా బయటపెట్టలేదు అంటూ ప్రభావతి, మనోజ్.. బాలుపై మండి పడతారు.

దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ మీనా ఎక్కడ అని బాలు అడుగుతాడు. అక్కడే ఉందని, ఇక్కడికి రావద్దని చెప్పి వచ్చానని ప్రభావతి చెబుతుంది. మీనా ఏం తప్పు చేసిందని, ఆమె తన భార్య అని, ఈ ఇంట్లో ఉండే హక్కు ఆమెకు ఉందంటూ...